Saturday, February 11, 2017

పవన్ కళ్యాణ్



పవన్ కల్యాణ్
Pawan2.jpg
పవన్ కల్యాణ్ ముఖచిత్రం
జననంకొణిదెల కల్యాణ్
(సెప్టెంబరు 21971)
బాపట్ల , ఆంధ్రప్రదేశ్.
తల్లి_పేరుఅంజనా దేవి
తండ్రి_పేరుకొణిదల వెంకట రావు
బిరుదు(లు)పవర్ స్టార్
వేరేపేరు(లు)కల్యాణ్ బాబు
వృత్తిసినిమా
నివాసంహైదరాబాదు
భార్య / భర్త(లు)నందిని (మొదటి భార్య, విడాకులు)
రేణుదేశాయ్(రెండవ భార్య, విడాకులు)
అన్నా లెజ్‌నేవా (మూడవ భార్య)
నరేంద్ర మోడీతో పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్గా ప్రసిద్ధుడైన కొణిదెల కల్యాణ్ బాబు ప్రముఖ తెలుగు సినీనటుడు/నిర్మాత/యుద్ధ కళాప్రావీణ్యుడు/దర్శకుడు/రచయిత మరియు రాజకీయవేత్త. ఆయన కొణిదెల వెంకటరావు, అంజనా దేవిలకు, సెప్టెంబరు 2, 1972న జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖ నటుడు మెగాస్టార్ గా ప్రసిద్ధి చెందిన చిరంజీవి (శివ శంకర వర ప్రసాద్) పవన్‌కు పెద్దన్నయ్య. నటుడు మరియు నిర్మాత అయిన నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య .
పవన్, పరిశ్రమలోని తన అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. ఇంటర్ మీడియట్ నెల్లూరు లోని వి.ఆర్.సి కళాశాలలో పూర్తి చేసాడు. పిమ్మట కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు.

నట జీవితం[మార్చు]

1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా "కళ్యాణ బాబు"గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. గబ్బర్ సింగ్కు గాను తెలుగులో ఉత్తమ నటునిగా ఫిల్ం ఫేర్ అవార్డును అందుకొన్నారు. అత్తారింటికి దారేది చిత్రం వసూళ్ళలో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టినది. అంజనా ప్రొడక్షన్స్పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో సినిమాలు నిర్మిస్తాడు.

నటన ప్రత్యేకతలు[మార్చు]

తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. తన చిత్రాలకి, చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు పవన్ కళ్యాణ్ ఫైట్ లని రూపొందించారు. తమ్ముడు చిత్రంలో లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ పాటను పూర్తి నిడివి ఆంగ్ల గీతంగా రూపొందించారు. బద్రి చిత్రం లో మేరా దేశ్ హై ప్యారా ప్యారా తెలుగుహిందీ మరియు ఆంగ్లముల కలయిక తో త్రిభాషా గీతంగా, ఖుషి లో యే మేరా జహాన్ గీతాన్ని పూర్తి నిడివి హిందీ గీతంగా రూపొందించారు. ఖుషి చిత్రంలో ఆడువారి మాటలకు అర్ధాలు వేరులేజానీ చిత్రంలో ఈ రేయి తీయనిది పాటలని రీ-మిక్స్ చేయించారు. ఖుషి లోని ద్వితీయార్థంలో జరిగే కార్నివాల్ ఫైట్ పవన్ కళ్యాణ్ ప్రతిభకు తార్కాణం. మార్షల్ ఆర్ట్స్ లో దిట్ట కావటంతో ఇతని చిత్రాలలో చాలా స్టంట్ లు నిజంగానే చేసినవే ఉంటాయి. అటువంటి స్టంట్ లను ఇతని చిత్రాల్లో ప్రత్యేకంగా స్లో మోషన్ లో చూపించటం జరుగుతుంది.

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరంచిత్రముపాత్రపోరాటాలుగానంనృత్యాలుఇతర విశేషాలు
1996అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికళ్యాణ్---
1997గోకులంలో సీతపవన్---
1998సుస్వాగతంగణేష్---
1998తొలిప్రేమబాలు---
1999తమ్ముడుసుభాష్తాడీచెట్టెక్కలేవుమేడ్ ఇన్ ఆంధ్ర,
కలకలలు తప్ప మిగిలినవన్నీ
2000బద్రిబద్రీనాథ్-బంగాళాఖాతంలో,
ఐ ఆం ఎన్ ఇండియన్,
ఏ చికితా
2001ఖుషిసిద్దార్థ్ రాయ్బైబైయ్యే బంగారు రమణమ్మగజ్జ గల్లు తప్ప మిగిలనవన్నీ
2003జానీజానీనువ్వు సారా తాగుతా, రావోయి మా కంట్రీకీఅన్ని పాటలుకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం
2004గుడుంబా శంకర్గుడుంబా శంకర్ / కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ / శంకర్ దీక్షితులుకిళ్ళీ కిళ్ళీఅన్ని పాటలు
2005బాలుబాలు, గని---
2006బంగారంబంగారం---
2006అన్నవరంఅన్నవరం--"నీవల్లే నీవల్లే" పాట
2007శంకర్ దాదా జిందాబాద్సురేశ్---అతిథి పాత్ర
2008జల్సాసంజయ్ సాహు---
2010కొమరం పులికొమరం పులి--
2011తీన్ మార్అర్జున్ పాల్వాయ్,
మైఖెల్ వేలాయుధం
--ద్విపాత్రాభినయం
2011పంజాజైదేవ్-పాపారాయుడు"పంజా" పాట
2012గబ్బర్ సింగ్వెంకటరత్నం నాయుడు ఊరాఫ్ గబ్బర్ సింగ్-పిల్లాదక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు,
దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్ - ఉత్తమ నటుడు,
సిని"మా" అవార్డ్ - ఉత్తమ నటుడు
2012కెమెరామెన్ గంగతో రాంబాబురాంబాబు---
2013అత్తారింటికి దారేదిగౌతం నందా ఊరాఫ్ సిద్ధు-కాటమ రాయుడా
2015గోపాల గోపాలశ్రీకృష్ణపరమాత్మ-
2016సర్దార్ గబ్బర్ సింగ్-
2017కాటమరాయుడు-

రాజకీయ జీవితం[మార్చు]

మార్చి 14, 2014 న జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరిపాడు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తెలిపాడు. రాష్ట్రాన్ని విభజించినతీరుకు కాంగ్రెస్ ను దోషిగా నిందిస్తూ, కాంగ్రెస్ ఎన్నికలలో గెలవకుండా పోరాడాలని తన అభిమానులకు పిలుపునిచ్చాడు[1]. ఆయన 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశారు. జనసేనపార్టీతో మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌కల్యాన్‌ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా టీడీపీ-బీజేపీ కూటమికి ప్రచారం చేశారు. ఈయన ప్రచారంతోనే టి.డి.పి ఏపీలో అధికారంలోకి రాగలిగినది. కాంగ్రెస్ హటావ్- దేశ్ బచావ్ అన్న ఆయన నినాదాన్ని అందుకున్న అభిమానులు మరియు ప్రజలు ఏపీలో ఒక్కసీటుకూడా కాంగ్రెస్ కు దక్కనివ్వలేదు.
ఈ సమయంలో గూగుల్ లో అత్యంత ఎక్కువ శోధించబడే రాజకీయవేత్తగా పవన్ నిలిచారు.

వ్యక్తిగత జీవితము[మార్చు]

మే 1997 లో నందినితో పవన్ కు వివాహం జరిగింది. జూలై 2007 లో రేణు దేశాయ్ తో పవన్ అక్రమ సంబంధాన్ని నెరుపుతోన్నాడని వారిద్దరికీ అప్పటికే ఒక కుమారుడు కూడా జన్మించి ఉన్నాడని కోర్టులో కేసు వేసినది.[2] చిరంజీవి కుటుంబంలోని 14 మందిపై ఆరోపణలు చేసినది. ఈ పిటిషన్ ను కోర్టు కొట్టివేయగా, నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొట్టివేతపై స్టే తెచ్చుకొన్నది. తర్వాత పవన్ కళ్యాణ్ విడాకులు కోరారు. నందిని భరణం కోరినది. తాత్కాలిత భరణంగా నెలకు ఐదు లక్షలు ఇప్పించాలన్న ఆమె దాఖలు చేసిన ఆ పిటిషన్ ను కూడా కోర్టు కొట్టివేయగా, ఈ కేసు కొట్టివేతపై కూడా నందిని ఉన్నత న్యాయస్థానం నుండి స్టే సంపాదించింది. ఐదు కోట్ల రూపాయలకు రాజీ కుదరగా నందిని అన్ని కేసులను ఉపసంహరించుకొన్నది. 12 ఆగష్టు 2008 లో విశాఖపట్నం లోని ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసినది.
నటిగా మారిన మోడల్ రేణూ దేశాయ్ని 28 జనవరి 2009 న వివాహం చేసుకున్నాడు. వీరికి కలిగిన కుమారుని పేరు అకీరా నందన్. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకీరా కురుసోవా పై అభిమానంతో వారు తమ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారు. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యా భర్తలుగా విడిపోయినా, తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణు ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.[3] విడిపోయే సమయంలో తాను పవన్ వద్ద నుండి పెద్ద ఎత్తున భరణం తీసుకొన్నాననే వార్తలలో నిజం లేదని, తాను స్వయంకృషితోనే తనకు కావలసినవన్నీ సమకూర్చుకొంటున్నానని స్పష్టం చేశారు.
2013 సెప్టెంబరు 30న ఇతని వివాహము రష్యా నటి అన్నా లెజ్‌నేవాతో జరిగింది. హైదరాబాదు లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది[4].

మూలాలు[మార్చు]